Header Banner

హెచ్‌సీయూ భూ వివాదం.. గట్టిగా పోరాడుతున్న విద్యార్థులు! సమంత ఏమ‌న్నారంటే..!

  Wed Apr 02, 2025 16:40        Others

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వివాదం నేపథ్యంలో హెచ్‌సీయూ వద్ద గ‌త రెండు రోజులుగా విద్యార్థులు ఆందోళ‌న‌కు దిగ‌డంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆ భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. ఇప్ప‌టికే ఈ వివాదంపై ప‌లువురు రాజ‌కీయ నేత‌ల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు స్పందించారు. ఈ వ్య‌వ‌హారంపై సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తూ న‌టి రేణు దేశాయ్ ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!


ఇక ఈ వివాదంపై ఇప్ప‌టికే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్, డైరెక్ట‌ర్‌ త‌రుణ్ భాస్క‌ర్, న‌టుడు ప్రియ‌ద‌ర్శి, ద‌ర్శ‌కుడు వేణు ఉడుగుల‌, సంగీత ద‌ర్శ‌కుడు మ‌ణిశ‌ర్మ‌, యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్, ఈషా రెబ్బా త‌దిత‌రులు కూడా స్పందించారు. తాజాగా ఈ వివాదంపై న‌టి స‌మంత కూడా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు. హెచ్‌సీయూ 400 ఎక‌రాల క‌థ‌నంపై ప్ర‌ముఖ ఆంగ్ల దిన‌ప‌త్రిక తెలంగాణ టుడేలో వ‌చ్చిన క‌థ‌నాన్ని పోస్ట్ చేసిన స‌మంత... కంచ గచ్చిబౌలి భూములను పరిరక్షించాలంటూ నినదించారు. ఈ సంద‌ర్భంగా ఆన్‌లైన్ వేదిక‌గా Change.org (సామాజిక స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించే సంస్థ‌) పిటిష‌న్‌కి సైన్ చేయాల‌ని కోరారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్, పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీపవన్ కల్యాణ్నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #HCULandDispute #StudentProtest #SaveHCU #SamanthaSpeaks #JusticeForHCU